ఒక్కసారిగా ఖాళీ అయిన శ్రీలీల
మొన్నటివరకు టాలీవుడ్ లో మోస్ట్ హ్యాపెనింగ్, బిజీయెస్ట్ హీరోయిన్ గా డిమాండ్ ఉన్న శ్రీలీలను ఒక్కసారిగా ఫ్లాపులన్నీ కమ్మేశాయి. గుంటూరు కారం సినిమా కమర్షియల్ గా వర్కవుట్ అయినా ఇది మహేష్ బాబు రేంజ్ సినిమా కాదని అందరూ అన్నారు. వీటికంటే ముందు శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఆదికేశవ, ఎక్స్ట్రా, స్కంద సినిమాలన్నీ డిజాస్టర్లే.
భగవంత్ కేసరి హిట్టయినప్పటికీ ఆ క్రెడిట్ మొత్తం బాలయ్యకే దక్కుఉంది. ప్రస్తుతం శ్రీలీల చేతిలో ఉన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ ఒక్కటే. అది తప్ప అమ్మడు కొత్త కమిట్మెంట్స్ ఏమీ ఇవ్వలేదు. ఉస్తాద్ మూవీ కోసం ఎప్పుడు డేట్స్ ఇవ్వాలనేది డైరెక్టర్ అయిన హరీష్ శంకర్ కే తెలియదు. కాబట్టి పవన్ అందుబాటులోకి వచ్చేవరకు ఆగాలి లేదంటే సినిమా నుంచి తప్పుకోవాలి. చూస్తూ చూస్తూ పవన్ పక్కన ఛాన్సును వదులుకోలేదు కాబట్టి వెయిట్ చేయడమొక్కటే దారి.
ఇది కాకుండా నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న రాబిన్ హుడ్ కోసం శ్రీలీలను అడిగారన్నారు కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. హీరోయిన్ లేకుండానే షూటింగ్ ను కానిచ్చేస్తున్నారు. వరుస ఫ్లాపులు పడటంతో అమ్మడు కోసం వెయిట్ చేసే వారు కూడా తగ్గిపోయారు. స్టార్ హీరోలంతా బిజీగా ఉన్నారు. ఇలాంటి టైమ్ లో శ్రీలీల తర్వాత ఏ హీరోలతో జత కట్టనుందో చూడాలి.













