Raja Saab: రాజా సాబ్ వాయిదాపై క్లారిటీ ఇచ్చిన జాక్
ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తున్న ది రాజా సాబ్(the Raja Saab) సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. అయితే రాజా సాబ్ వాయిదా పడుతుందనే వార్త గత కొన్ని రోజుల కిందట నెట్టింట ప్రచారం అవడంతో ఆ వార్త డార్లింగ్ ఫ్యాన్స్ ను ఎంతగానో కలవరపెట్టింది. ముందు ఇది కేవలం రూమరే అనుకున్నారు కానీ తర్వాత అది నిజమనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
సిద్ధు జొన్నలగడ్డ(Siddhu Jonnalagadda), బొమ్మరిల్లు భాస్కర్(Bommarillu Bhaskar) కాంబోలో రూపొందుతున్న జాక్(Jack) సినిమాను ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేయడంతో అదే డేట్ కు వచ్చే రాజా సాబ్ రిలీజ్ పై అనుమానాలు తీరినట్టే అనిపిస్తుంది. వీఎఫ్ఎక్స్(VFX) వర్క్స్ కోసం చాలా టైమ్ పడుతుందని ఆ డేట్ ను రాజా సాబ్ అందుకోవడం కష్టమని అందుకే సినిమాను వాయిదా వేస్తున్నారని తెలుస్తోంది.
అందుకే కన్నప్ప(Kannappa) సినిమాను ఏప్రిల్ 25న రిలీజ్ చేయనున్నారు. ఒకవేళ రాజా సాబ్ ఏప్రిల్ 10కి వస్తే వెంటనే ప్రభాస్(Prabhas) కీలక పాత్ర పోషించిన కన్నప్పను రెండు వారాల గ్యాప్ లో రిలీజ్ చేయరు. ఇది కాకుండా ప్రభాస్ హోమ్ బ్యానర్ లో రూపొందుతున్న ఘాటి(Ghaati)ని కూడా యూవీ క్రియేషన్స్(UV Creations) ఏప్రిల్ 18న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేసింది. దీంతో రాజా సాబ్ రిలీజ్ పై ఉన్న డౌట్స్ అన్నీ మెల్లిగా తీరిపోయాయి. సమ్మర్ ఎండింగ్ లో కానీ జూన్ లో కానీ రాజా సాబ్ రిలీజయ్యే ఛాన్సులున్నాయి.













