సంక్రాంతి సినిమాలపై క్లారిటీ ఎప్పుడొస్తుందో!
వచ్చే ఏడాది సంక్రాంతికి ఏయే సినిమాలు రిలీజవుతాయనే విషయంలో క్లారిటీ లేక బయ్యర్లకు మతి పోతుంది. రామ్ చరణ్(ram charan) గేమ్ ఛేంజర్(game changer) జనవరి 10న రిలీజ్ కానుంది. అందులో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. బాలయ్య(Balaiah)- బాబీ(Bobby) కాంబినేషన్ లో రూపొందుతున్న ఎన్బీకే109(NBK109) ఓ రెండ్రోజుల తర్వాత అంటే జనవరి 12న రిలీజ్ కానున్నట్లు నిర్మాత నాగవంశీ(Naga Vamsi) హింట్ ఇస్తున్నాడు.
ఈ రెండు సినిమాలు తప్పించి ఇప్పటికైతే రిలీజ్ డేట్ ను కన్ఫర్మ్ చేసిన సినిమాలేమీ లేవు. గేమ్ ఛేంజర్ నిర్మిస్తున్న దిల్ రాజు(dil Raju) నిర్మాణంలోనే వస్తోన్న వెంకటేష్(Venkatesh)- అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుందంటున్నారు కానీ ఇంకా క్లారిటీ అయితే లేదు. సందీప్ కిషన్(sundeep kishan) మజాకా(Mazaaka) మాత్రం పండగ సీజన్ ను ఎట్టి పరిస్థితుల్లో మిస్సయ్యేలా కనిపించడం లేదు.
అజిత్(ajith) గుడ్ బ్యాడ్ అగ్లీ(good bad ugly) రిలీజ్ డేట్ విదాముయార్చి(Vidamuyarchi)పై ఆధారపడి ఉంది. అయితే తాజాగా ఈ లిస్ట్ లోకి శర్వానంద్(Sharwanand)- రామ్ అబ్బరాజు(ram Abbaraju) కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కూడా చేరింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా సంక్రాంతిని టార్గెట్ చేసినట్లు సమాచారం. అంతేకాదు వామన(Vamana) సినిమాను కూడా సంక్రాంతికి దింపాలని చూస్తున్నారట. ఈ సినిమాలో బెల్లంకొండ శ్రీనివాస్(Bellamkonda Sreenivas), మంచు మనోజ్(manchu Manoj), నారా రోహిత్(nara rohit) ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే పండగకు బాక్సాఫీస్ వద్దకు ఏయే సినిమాలొస్తాయనే సస్పెన్స్ ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు.













