Krish4: బ్లాక్ బస్టర్ సీక్వెల్ కు బడ్జెట్ పెట్టేవారు లేరా?
హృతిక్ రోషన్(Hrithik Roshan) మొదటి సినిమా కహో నా ప్యార్ హై(Kaho na pyar hi) సినిమాతోనే స్టార్ హీరో రేంజ్ కు వెళ్లాడు. కానీ తర్వాత మాత్రం వరుస ఫ్లాపులు తన కెరీర్ ను నత్త నడక సాగించాయి. దీంతో కొడుకును ఫ్లాపుల నుంచి బయటకు తీసుకుని రావడానికి మరోసారి తన తండ్రి రాకేష్ రోషన్(Rakesh Roshan) రంగంలోకి దిగి కోయి మిల్ గయా(Koi mil gaya) సినిమాను తీసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
ఇండియాలో సీక్వెల్స్ కు పెద్దగా క్రేజ్ లేని రోజుల్లోనే రాకేష్ రోషన్ ఆ సినిమాకు సీక్వెల్స్ గా క్రిష్(Krish), క్రిష్3(Krish3) తీసి బ్లాక్ బస్టర్లు అందుకున్నాడు. క్రిష్3 టైమ్ లోనే క్రిష్4 కూడా ఉంటుందన్నారు. దానికి సంబంధించిన స్క్రిప్ట్ కూడా రెడీ అయింది. కానీ ఇప్పటివరకు ఆ సినిమా పట్టాలెక్కింది లేదు. మధ్యలో రాకేష్ క్యాన్సర్ బారిన పడటంతో క్రిష్4 ఉంటుందా లేదా అని డౌట్స్ వచ్చాయి.
కానీ ఆయన కోలుకుని తిరిగి సినిమా తీయడానికి రెడీ అయినప్పటికీ క్రిష్ 4 ముందుకు సాగడం లేదు. అయితే ఇన్నేళ్లైనా క్రిష్4(Krish4) సెట్స్ పైకి వెళ్లకపోవడాన్ని గల కారణాన్ని రాకేష్ రోషన్ వెల్లడించాడు. బడ్జెట్ సమస్యల వల్లే క్రిష్4 ముందుకు వెళ్లట్లేదని, ప్రేక్షకులు వరల్డ్ సినిమాను ఆదరిస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను కూడా అలాంటి ప్రమాణాలతో తీయాలని, అంత భారీ బడ్జెట్ పెట్టడానికి నిర్మాతలెవరూ ముందుకు రాకపోవడంతోనే క్రిష్4 లేటవుతుందని వెల్లడించాడు.













