NKR21 టైటిల్ అదేనా?
నందమూరి కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram) డెవిల్(Devil) సినిమాతో హిట్ కొట్టాక అతడి నుంచి మరో సినిమా రాలేదు. దీంతో అతడి తదుపరి చిత్రం కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ప్రదీప్ చిలుకూరి(Pradeep Chilukuri) డైరెక్షన్లో ఓ యాక్షన్ సినిమాను చేస్తుండడం తెలిసిందే. కళ్యాణ్ రామ్ కెరీర్లోనే అత్యధిక బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అశోక్ క్రియేషన్స్(Ashok Creations) నిర్మిస్తోంది. అశోక్ వర్ధన్ ముప్పా(Ashok Vardhan Muppa), సునీల్ బలుసు(Sunil Balusu) సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంకు ముప్పా వెంకయ్య చౌదరి(Muppa Venkaiah Chowdary) సమర్పకుడు.
హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా రూపొందుతున్న ఈ చిత్రంకు తొలుత మెరుపు(Merupu) అనే టైటిల్ను అనుకున్నట్టు వార్తలొచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం NKR21 సినిమాకు రుద్ర అనే టైటిల్ సరిగ్గా సరిపోతుందని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ టైటిల్నే ఫిక్స్ చేయాలని చిత్ర బృందం అనుకుంటుందంటా.
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి(Vijayasanthi) పవర్ఫుల్ పోలీసు అధికారి పాత్రలో కనిపించబోతున్నట్టు ఇప్పటికే చిన్న గ్లింప్స్ ద్వారా దర్శకుడు తెలిపారు. ఆమెతో పాటూ సోహైల్ ఖాన్(Sohail Khan), సాయి మంజ్రేకర్(Saiee Manjrekar), శ్రీకాంత్(Srikanth) ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాంతార(Kanthara) ఫేమ్ అజనీష్ లోక్నాథ్(Ajanish Lokanath) సంగీతం అందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయినట్టు సమాచారం. ఈ మూవీకు సంబంధించిన టైటిల్ ను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.













