ఫస్ట్‌టైమ్ మరో హీరోతో కలిసి నటించనున్న నితిన్
2002లో `దిల్` సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నితిన్ ఈ 18 ఏళ్ళలో 27 సినిమాల్లో హీరోగా నటించాడు. ఒక దశలో వరస ఫ్లాపులతో సతమతమవుతున్నప్పుడు `ఇష్క్` రూపంలో పెద్ద హిట్ వచ్చింది. అప్పటి నుంచి కథల విషయంలో, దర్శకుల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడు. విజయాలు సాధిస్తున్నాడు. అయితే ఇప్పటివరకు అతని కెరీర్లో మరో హీరోతో కలిసి సినిమా చేయలేదు. శ్రీ ఆంజనేయం చిత్రంలో అర్జున్‌తో కలిసి నటించినా ఆ ఇతివృత్తం వేరు. తను వరస ఫ్లాపుల్లో ఉన్నా హిట్ కోసం మరో హీరోతో కలిసి నటించాలన్న ఆలోచన కూడా రానివ్వకుండా సోలో హీరోగానే కొనసాగాడు. ఇప్పుడు మరో హీరోతో కలిసి నటించేందుకు రెడీ అయ్యాడు. అతనే సత్యదేవ్. నిజానికి అతను క్యారెక్టర్ ఆర్టిస్టే అయినా ఈమధ్యకాలంలో చిన్నా చితకా సినిమాల్లో హీరోగా నటిస్తూ తన టాలెంట్‌ని ప్రూవ్ చేసుకునేందుకు ట్రై చేస్తున్నాడు. లూజర్ పేరుతో రూపొందిన వెబ్‌సిరీస్‌లో కూడా నటించాడు. ఇప్పుడు నితిన్‌తో కలిసి ఓ సినిమాలో నటించబోతున్నాడు. తనతో ఛల్మోహనరంగ చిత్రాన్ని తెరకెక్కించిన కృష్ణచైతన్యతో మరో సినిమా చేయబోతున్నాడు నితిన్. ఆ సినిమా ఫ్లాప్ అయినప్పటికీ అతనికి మరో అవకాశం ఇస్తున్నాడు. `పవర్‌పేట` పేరుతో పక్కా మాస్ ఎంటర్టైనర్గా రూపొందే ఈ సినిమాలో నితిన్, సత్యదేవ్‌ల క్యారెక్టర్లు ఈక్వల్‌గానే ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది.
`భీష్మ`తో మంచి హిట్‌ని అందుకున్ననితిన్ దాని తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో `రంగ్‌దే` చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ నిలిచిపోయింది. ఆ సినిమా తర్వాత చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. ఇది పూర్తయిన వెంటనే కృష్ణచైతన్య కాంబినేషన్లో సినిమా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.













