మొదటిసారి మూడు విభిన్నమైన పాత్రల్లో..
మొదటిసారి మూడు విభిన్నమైన పాత్రల్లో.. కొంతమంది హీరోలకు యాక్షన్ సినిమాలు చేయడం అంటే ఇష్టం. కొంతమందికి కామెడీ, కొంతమందికి ఫ్యామిలీ మూవీస్… ఇలా ఒక్కో హీరోకు ఒక్కో అభిరుచి ఉంటుంది. కొందరు హీరోలు మాత్రం ఎప్పుడూ ప్రయోగాత్మక సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. తాము చేసే క్యారెక్టర్ల కోసం ఎంత రిస్కయినా తీసుకుంటారు. ప్రస్తుతం పౌత్లో ఉన్న హీరోల్లో కమల్‌హాసన్, విక్రమ్ అలాంటి సినిమాలు చేయడానికి ఇష్టపడతారు. కానీ, టాలీవుడ్ విషయానికి వస్తే అలాంటి ప్రయోగాలు, రిస్కీ క్యారెక్టర్స్ చేసేందుకు ఎవరూ ముందుకు రారు. ఎందుకంటే హీరోగా వారికి ఉన్న ఇమేజ్ వారిని అడ్డుకుంటుంది. కానీ, ఆ అడ్డుగోడల్ని తొలగిస్తూ ఓ విభిన్నమైన సినిమా చేసేందుకు ముందుకు వస్తున్నాడు.
`భీష్మ` సాధించిన ఘనవిజయం తర్వాత నితిన్ మరో నాలుగు సినిమాలకు ఓకే చెప్పాడు. అయితే అవి ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఎవరూ చెప్పలేరు. వాటిలో ఒకటి కృష్ణచైతన్య దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ సినిమా స్క్రిప్ట్ మీద చైతన్య రెండు సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాడు. `పవర్‌పేట` పేరుతో తెరకెక్కే ఈ సినిమాలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నట్టు తెలుస్తోంది.
హీరో నితిన్ ఈ సినిమాలోమొదటిసారి మూడు పాత్రలు పోషించనున్నాడు. 20 ఏళ్ళ కుర్రాడిగా, 40 ఏళ్ల మధ్య వయస్కుడిగా, 60 ఏళ్ల వృద్ధుడిగా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రల్లో నటించనున్నాడు. నితిన్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. అందుకోసం హాలీవుడ్ నుంచి టెక్నీషియన్స్‌ను రప్పించనున్నారు. ఈ మూడు క్యారెక్టర్స్‌కు డిఫరెంట్ మేకప్ అవసరం అవుతుంది. అందుకోసం ఖర్చుకు వెనకాడకుండా హాలీవుడ్ టెక్నీషియన్స్‌ని పిలిపిస్తున్నారు. ఈ చిత్రాన్ని తమ సొంత బేనర్లోనే నిర్మించేందుకు నితిన్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.













