Robin hood: రాబిన్ హుడ్ వల్ల తమ్ముడుకి నష్టం తప్పదా?
క్రిస్మస్ బరి నుంచి నితిన్(Nithin) రాబిన్ హుడ్(Robin hood) తప్పుకుంది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) అధికారికంగా అనౌన్స్ చేయడంతో అందరికీ క్లారిటీ వచ్చింది. లాస్ట్ మినిట్ వరకు నితిన్ క్రిస్మస్ రిలీజ్ కు ట్రై చేశాడు కానీ కుదరకపోవడంతో కాంప్రమైజ్ అయ్యాడు. అయితే రాబిన్ హుడ్ ను సంక్రాంతి బరిలో దింపాలనే ప్రతిపాదన మాత్రం ఇంకా ఫైనల్ అవలేదు.
గేమ్ ఛేంజర్(Game Changer), డాకు మహారాజ్(Daku Maharaj), సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam) సినిమాలతో పోటీ పడటం ఎంత వరకు కరెక్ట్ అనే యాంగిల్ లో నిర్మాతలు ఆలోచిస్తున్నారట. దీంతో ఇప్పుడు రాబిన్ హుడ్ సినిమాకు రెండే ఆప్షన్లున్నాయి. అందులో ఒకటి జనవరి చివరలో రావడం లేదంటే శివరాత్రికి రిలీజ్ చేయడం. కానీ శివరాత్రికి నితిన్ తమ్ముడు(Thammudu) సినిమా రిలీజ్ కు షెడ్యూల్ అయి ఉంది.
ఎంతోముందుగా నిర్మాత దిల్ రాజు(Dil Raju) ఆ సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు. ఒకవేళ రాబిన్ హుడ్ కూడా శివరాత్రికి రిలీజ్ కావాలనుకుంటే తమ్ముడు వాయిదా వేసుకోవాలి. కానీ దిల్ రాజు అందుకు ఒప్పుకుంటాడా లేదా అన్నది చూడాలి. అంతేకాదు తక్కువ గ్యాప్ లో తనవి రెండు సినిమాలు రిలీజ్ అవడం నితిన్ కూడా ఇష్టపడడు. కాబట్టి ఇవన్నీ తేలాలంటే కాస్త టైమ్ పట్టేట్టుంది.













