స్వయంభు హిట్ అయితే నిఖిల్ రేంజ్ మారడం ఖాయం!
గతేడాది కార్తికేయ2 సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సూపర్ సక్సెస్ అందుకున్న నిఖిల్ రేంజ్ ఆ సినిమాతోనే మారిపోయింది. నిఖిల్ క్రేజ్ పెరగడంతో తనతో పెద్ద మొత్తంలో బడ్జెట్ పెట్టి సినిమాలు తీయడానికి నిర్మాతలు రెడీ అయ్యారు. స్పై కూడా అలా వచ్చిన సినిమానే. కానీ ఈ సినిమా అంచనాలను అందుకోలేక నష్టాలను మిగిల్చింది. స్పై నష్టాలను మిగిల్చినా నిఖిల్ క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆల్రెడీ పాన్ ఇండియా రేంజ్లో ది ఇండియా హౌస్ అనే సినిమాను చేస్తున్నాడతను. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తాజాగా స్వయంభు అనే సినిమాను సెట్స్ మీదకు వెళ్లింది. ఈ సినిమా ఇవాళే గ్రాండ్గా లాంఛ్ అయింది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలుపెట్టారు.
సినిమా మొదలైన సందర్భంగా ఒక మంచి పోస్టర్ను కూడా మేకర్స్ రిలీజ్ చేశారు. పోస్టర్ లో గుర్రం మీద యోధుడి అవతారంలో కనిపిస్తున్నాడు నిఖిల్. ఈ సినిమాను టాలీవుడ్ సీనియర్ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. రూ. 30 కోట్లతో ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్టోరీ చోళుల కాలం నాటి ఒక యోధుడి కథగా తెలుస్తోంది.
కల్పిత కథగా దీన్ని తెరపై ప్రెజెంట్ చేయబోతున్నాడు. స్క్రిప్ట్ కూడా చాలా బాగా వచ్చిందని యూనిట్ వర్గాలు చెప్తున్నాయి. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుందట. మనోజ్ పరమహంస, రవి బస్రూర్ ఈ సినిమాకు పని చేస్తున్నారు. ఈ సినిమా కానీ హిట్ అయితే నిఖిల్ రేంజ్ మరింత పెరుగుతుందనడంలో ఆశ్చర్యం లేదు.













