అంచనాలను మించేలా వార్2
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ హార్ట్ థ్రోబ్ హృతిక్ రోషన్ కాంబినేషన్ లో వార్2 అనే భారీ మల్టీస్టారర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం తారక్ నిరంతరం ముంబై- హైదరాబాద్కు తిరుగుతున్నాడు. ఇదిలా ఉంటే వార్2 కు సంబంధించిన యాక్షన్ ఎపిసోడ్స్ గురించి వస్తున్న వార్తలు ఫ్యాన్స్ కు నిద్ర పట్టనీయకుండా చేస్తున్నాయి.
అందులో ఒకటి రీసెంట్ గా షూట్ చేసిన స్పీడ్ బోట్ ఛేజింగ్. ఈ సీక్వెన్స్ ను ఆరు రోజుల పాటూ ఏకధాటిగా షూటి చేశారని టాక్. ఎగసి పడే అలల మధ్య జరిగే ఈ బోట్ ఛేజింగ్ ను డిజైన్ చేయడానికే మూడు నెలల టైమ్ పట్టిందట. సౌత్ ఆఫ్రికాకు చెందిన ప్రముఖ యాక్షన్ డైరెక్టర్ ఫ్రాన్జ్ స్పిల్హాస్ సమక్షంలో దీన్ని షూట్ చేశారట.
ఎంతో ఉత్కంఠభరితంగా హాలీవుడ్ సినిమాకు తీసిపోని రీతిలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ వార్2 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. అంతే కాదు తారక్-హృతిక్ మధ్య ఎయిర్ క్రాఫ్ట్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ కూడా నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది. చూస్తుంటే వార్2 అంచనాలకు మించే ఉంటుందని అర్థమవుతోంది. వచ్చే ఏడాది ఆగస్ట్ లో రిలీజ్ కానున్న ఈ సినిమాను జనవరి కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ప్లాన్ చేస్తున్నాడు.













