గోపీచంద్-శ్రీను వైట్ల సినిమాకు కష్టాలు
పదేళ్ల కిందట వరకు టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలిగిన శ్రీను వైట్ల చూస్తుండగానే ఫేడవుట్ అయిపోయాడు. అప్పట్లో రాజమౌళి, త్రివిక్రమ్, సుకుమార్ తర్వాత స్థానంలో ఉన్న శ్రీను వైట్ గురించి ఇప్పుడందరూ లైట్ తీసుకుంటున్నారు. దానికి కారణం గత కొంత కాలంగా ఆయన్నుంచి వస్తున్న సినిమాలే. దీంతో వైట్లతో సినిమా చేయడానికి నిర్మాతలు భయపడే సిట్యుయేషన్ కు వచ్చారు.
ఆఖరికి ఫ్లాపుల్లో ఉన్న మంచు విష్ణు కూడా ఢీ సినిమాకు సీక్వెల్ అనౌన్స్ చేసినట్లే చేసి, తర్వాత వెనుకడుగు వేశాడు. మొత్తానిక గోపీచంద్ హీరోగా చిత్రాలయం మూవీస్ అనే కొత్త బ్యానర్ లో శ్రీను వైట్ల సినిమాను అనౌన్స్ చేసి, మొదటి షెడ్యూల్ను మిలాన్ లో చాలా గ్రాండ్ గా స్టార్ట్ చేశాడు. మిలాన్ షెడ్యూల్ తర్వాత ఆ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.
తాజాగా ఈ ప్రాజెక్ట్ కు కొన్ని ఇబ్బందులు తలెత్తినట్లు వార్తలొస్తున్నాయి. ఈ బ్యానర్ లో పార్టనర్ గా ఉన్న ఒకరు తప్పుకున్నారని, దీంతో వేరే బ్యాకప్ తో సినిమా నిర్మాణమంతా ఒకరి మీదే పడిందని తెలుస్తోంది. దానికి తోడు ఈ సినిమాకు అనుకున్న దానికంటే బడ్జెట్ ఎక్కువ అవుతుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికైనా శ్రీను వైట్ల బడ్జెట్ ను దృష్టిలో పెట్టుకుని సినిమాను పూర్తి చేస్తే బాగుంటుందని, లేకపోతే సినిమాకు చాలా ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు.













