Akhanda2: అఖండ 2 తాండవం డిసెంబర్ 12న రిలీజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీనుల మోస్ట్ ఎవైటెడ్ మాస్, డివైన్ ఎంటర్టైనర్ అఖండ 2: ది తాండవం అన్ని సమస్యలను పరిష్కరించుకుంది. ఈ చిత్రం ఇప్పుడు డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది,.డిసెంబర్ 11 న గ్రాండ్ ప్రీమియర్స్ ఉండనున్నాయి .14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. ఎం తేజస్విని నందమూరి సమర్పణలో వస్తున్న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు గొప్ప థియేటర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబో సింహా, లెజెండ్, అఖండతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్లను అందించింది. వారి నాల్గవ కొలాబరేషన్ వస్తున్న సినిమా కావడం, ముఖ్యంగా బాలకృష్ణ వరుసగా నాలుగు హిట్లను సాధించడంతో అఖండ2 పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ప్రతి ప్రమోషనల్ కంటెంట్ మరింత బజ్ పెంచింది. సనాతన హైందవ ధర్మం బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ చిత్రం మాస్, యాక్షన్, డివైన్ ఎలిమెంట్స్ తో గ్రేట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించబోతుంది.
హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలతో పాటు, ఈ చిత్రంలో అద్భుతమైన ఎమోషన్స్ ఉండబోతున్నాయి, ముఖ్యంగా కథనాన్ని నడిపించే మనసుని హత్తుకునే మదర్ సెంటిమెంట్ ప్రేక్షకులకు మంచి ఎమోషన్ అందించబోతుంది. ప్రేక్షకులు బాలకృష్ణను మూడు విభిన్న గెటప్లలో చూడబోతున్నారు, ఇది మరింత ఉత్సాహాన్ని జోడిస్తోంది. ఎస్ థమన్ సంగీతం మరో మెయిన్ హైలైట్, ఇది సినిమా ఎనర్జీ, గ్రాండియర్ ని పెంచుతుంది.
సంయుక్త కథానాయికగా నటించగా, ఆది పినిశెట్టి, హర్షాలి మల్హోత్రా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీని సి. రాంప్రసాద్, సంతోష్ డి. డేటకే నిర్వహిస్తున్నారు. తమ్మిరాజు ఎడిటర్. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్.






