NBK109 టీమ్ లో కన్ఫ్యూజన్
భగవంత్ కేసరి(Bhagavanth Kesari) తర్వాత నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) హీరోగా తన 109వ సినిమాను బాబీ(Bobby) దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రెండు కీలక నిర్ణయాలు తీసుకోవడంలో చిత్ర యూనిట్ ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది. అందులో ఒకటి టైటిల్ కాగా రెండోది రిలీజ్ డేట్. టైటిల్ కోసం కొన్ని పేర్లను పరిశీలించారు. మరో రెండు మూడు రోజుల్లో ఏదొక టైటిల్ను ఫైనల్ చేయనున్నారు.
ఇక రిలీజ్ డేట్ విషయానికొస్తే ఎన్బీకే109(NBK109)ను జనవరి 9న అనుకుంటున్నట్లు వచ్చిన ప్రాథమిక సమాచారానికి మిక్డ్స్ రెస్పాన్స్ వస్తుందట. సంక్రాంతి సీజన్ లో అందరికంటే ముందు రావడం వల్ల ఓపెనింగ్స్ వరకు ఓకే కానీ థియేటర్ల పరంగా తర్వాత వచ్చే ఇబ్బందులు కలెక్షన్స్ పై ఎఫెక్ట్ చూపిస్తాయి. జనవరి 10న గేమ్ ఛేంజర్(Game Changer) ఉంది కాబట్టి దిల్ రాజు(Dil Raju) పెద్ద ఎత్తున థియేటర్లను ఆక్రమించుకుంటాడు.
ఒకవేళ వెంకటేష్(Venkatesh)- అనిల్ రావిపూడి(Anil Ravipudi) సినిమా కూడా లైన్ లో ఉంటే సిట్యుయేషన్ ఇంకా దారుణంగా మారుతుంది. దీని కంటే జనవరి 12న బాలయ్య(Balakrishna) సినిమాను రిలీజ్ చేస్తే అన్ని విధాలా బావుంటుందని బయ్యర్లతో పాటూ ఫ్యాన్స్ కూడా అనుకుంటున్నారు. సినిమాలో కంటెంట్ బావుంటే లేట్ గా వచ్చినా ఇబ్బంది ఉండదు. ఏదేమైనా ఈ విషయంలో దీపావళి నాటికి డెసిషన్ తీసుకునే ఛాన్సుంది.













