ఆ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న NBK109
అఖండ నుంచి తర్వాత వచ్చిన వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో మంచి హిట్స్ అందుకుని హ్యాట్రిక్ కొట్టిన బాలయ్య ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం బాలయ్య తన 109వ సినిమాను బాబీ దర్శకత్వంలో చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య మార్క్ మాస్ ఎలిమెంట్స్, ఫ్యాన్స్ కు ట్రీట్ ఇచ్చే అంశాలు చాలానే ఉంటాయంటున్నారు.
ఈ సినిమాకు వీర మాస్ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. వాల్తేరు వీరయ్య సినిమాతో మెగా స్టార్ కు మంచి హిట్ ఇచ్చిన బాబీ, ఈ సినిమాతో బాలయ్య కు కూడా హిట్ ఇవ్వాలని టార్గెట్ గా పెట్టుకున్నాడట. అయితే ఈ సినిమా కోసం అఖండ సెంటిమెంట్ ను ఫాలో అవుతుందట టీమ్. అఖండ సినిమా డిసెంబర్ లో రిలీజై సెన్సేషనల్ హిట్ అయింది.
ఇప్పుడు ఆ సెంటిమెంట్ తోనే బాలయ్య- బాబీ కాంబోలో వస్తున్న సినిమాను కూడా డిసెంబర్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారట. డిసెంబర్ మొదటి రెండు వారాల్లో ఈ సినిమాను రిలీజ్ చేసి హిట్ అందుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసి అఖండ2 ని సెట్స్ పైకి తీసుకెళ్లాలని బాలయ్య చూస్తున్నాడట.













