నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ రిలీజ్ సెంటిమెంట్?
నట సింహం నందమూరి బాలకృష్ణ అఖండ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నట్లు తెలుస్తోంది? బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలిసి చేసిన అఖండ సినిమాతో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఆ సినిమా ఇచ్చిన కిక్‌తో ఇప్పుడు NBK #107 చేస్తున్నారు. అయితే ఈ సినిమా సక్సెస్ కోసం అఖండ సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్నారట బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన 100వ సినిమా గౌతమీ పుత్ర శాతకర్ణి తర్వాత చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో విజయాలను అందుకోలేక పోయారు. దాంతో మాంచి కసితో ఉన్న బాలయ్య మళ్ళీ హిట్ కోసం బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఇద్దరు కలిసి అఖండ సినిమాను చేసి హ్యాట్రిక్ అందుకున్నారు. ఏపీలో ఓ వైపు టికెట్ రేట్ల సమస్య, మరోవైపు కరోనా ఇబ్బందులు..అయినా బాలయ్య బోయపాటి అఖండ సినిమాతో అఖండ విజయాన్ని అందుకున్నారు. చెప్పాలంటే ఇది కనివిని ఎరుగని విజయం.
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలోనూ అఖండ అద్భుతమైన వసూళ్లను రాబట్టింది. దాంతో ఇప్పుడు బాలయ్య చేస్తున్న తన 107వ సినిమా ను కూడా అదే తేదీన రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు ఇప్పుడు టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో శృతి హాసాన్ హీరోయిన్గా నటిస్తుంది. అయితే, వాస్తవంగా ఈ సినిమాను దసరా కు రిలీజ్ చేయాలనీ మైత్రి మూవీ మేకర్స్ ప్లాన్ చేశారు. ఆ ప్లానింగ్ తోనే చిత్రీకరణ కూడా జరుపుతున్నారు. ఒకవైపు షూటింగ్ జరుపుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ని కంప్లీట్ చేస్తూ వస్తున్నారు. అయినా గత ఏడాది డిసెంబర్ 2న అఖండ రిలీజై భారీ సక్సెస్ సాధించి ఉండటంతో ఇప్పుడు ఎన్బీకె #107 కూడా ఈ ఏడాది దసరాకి కాకుండా డిసెంబర్ 2నే రిలీజ్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే ఈ మూవీ పోస్టర్స్‌లో బాలయ్యను చూసిన అభిమానులు రెచ్చిపోతున్నారు. ఇక టీజర్, అందులోని డైలాగులను చూసి మరో బ్లాక్ బస్టర్ ఖాయమని చెప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాపై అంచనాలు కూడా భారీగా నెలకొన్నాయి. మరి అధికారికంగా బాలయ్య 107 ఎప్పుడు విడుదల తేదీని ప్రకటిస్తారో చూడాలి.













