Nayanathara: ముస్సోరికి లేడీ సూపర్ స్టార్

సంక్రాంతికి వస్తున్నాం(sankranthiki Vasthunnam) సినిమా తర్వాత అనిల్ రావిపూడి(anil ravipudi) ఈసారి ఏకంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి(chiranjeevi)కి కథ చెప్పి మెప్పించి ఒప్పించాడు. చిరంజీవి కెరీర్లో 157(mega157)వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అందరికీ మంచి అంచనాలున్నాయి. ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా నయనతార(nayanthara) నటిస్తుంది. ఎప్పుడూ లేనిది ఈ సినిమాకు నయన్ ప్రమోషన్స్ చేయడానికి కూడా ఒప్పుకుందని టాక్.
ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమా, వెంటనే సెట్స్ పైకి వెళ్లి అనుకున్న దాని కంటే ఒక రోజు ముందుగానే మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. రీసెంట్ గా రెండో షెడ్యూల్ కోసం చిత్ర యూనిట్ మొత్తం ముస్సోరికి వెళ్లింది. అయితే ఈ రెండో షెడ్యూల్ షూటింగ్ లో రేపటి నుంచి నయనతార కూడా జాయిన్ కానున్నట్టు సమాచారం.
మెగా157 ముస్సోరి షెడ్యూల్ మరో రెండ్రోజుల పాటూ జరగనుందని, ఈ షెడ్యూల్ లో పలు కీలక సీన్స్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాలో చిరంజీవితో నెక్ట్స్ లెవెల్ కామెడీని చేయించనున్నాడట అనిల్(anil). భీమ్స్ సిసిరోలియో(bheems ciciroler) సంగీతం అందిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.