నయన్, త్రిష.. ఎవరైనా ఒకటే!
సౌత్‌లో ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ గా నయనతారకు పేరుంది. జవాన్ లాంటి సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో తన క్రేజ్‌ను విస్తరించుకున్న నయనతార తన సక్సెస్‌తో సంబంధం లేకుండా ఒక్కో సినిమాకు రూ.10 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు కమల్ హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో రానున్న సినిమా కోసం నయన్ కు రూ.12 కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు సమాచారం.
ఈ సినిమాలో వాస్తవానికి త్రిష నటించాల్సింది కానీ ఇప్పుడు త్రిష ప్లేస్ లో నయన్‌ను అనుకుంటున్నారట మేకర్స్. ఒకవేళ నయన్ కాకుండా ఈ సినిమాలో త్రిష నటించినా సరే మేకర్స్ అదే రెమ్యూనరేషన్ ఇవ్వాలనుకున్నారట. సౌత్ లో నయన్‌కు ధీటుగా సత్తా ఉన్న త్రిషకు ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ ఇవ్వాలనుకోవడం మ్యాటర్ ఏం కాదు.
కానీ త్రిషకు నయన్ లాగా పాన్ ఇండియా స్థాయిలో తగ్గ గుర్తింపు లేదు. అప్పట్లో హిందీ సినిమాల్లో ట్రై చేసింది కానీ పెద్దగా వర్కవుట్ అవలేదు. నయనతార ఇమేజ్‌తో పోల్చి చూసినా త్రిష రేంజ్ తక్కువేం కాదు. టాలీవుడ్, కోలీవుడ్ లో ఒకప్పుడు అగ్ర నటిగా ఉన్న హీరోయిన్ త్రిష. ఇప్పుడు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ లో త్రిష దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.













