టాలీవుడ్ కు మరో క్లాస్ విలన్
వెంకటేష్ ప్రస్తుతం తన 75వ సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని వెంకీతో పాటూ, దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎంతో మంది దర్శకులను, ఎన్నో కథలను విన్నాక లాస్ట్ కి ఈ సినిమాను హిట్ ఫేమ్ శైలేష్ కొలను చేతిలో పెట్టారు. సైంధవ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది.
ఈ సినిమాకు శైలేష్ ను సెలెక్ట్ చేసిన వెంటనే ఫ్యాన్స్ ఎంతో సర్ప్రైజ్ అయ్యారు. ఈ సినిమాకు శైలేష్ సెలెక్ట్ చేసుకున్న కాస్టింగ్ కూడా ఇంట్రెస్టింగ్ గానే ఉంది. శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ కాగా, బాలీవుడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ విలన్ క్యారెక్టర్ చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు కూడా. సైంధవ్ లో నవాజుద్దీన్ విలన్ రోల్ చేస్తున్నారని తెలిసి అందరూ చాలా ఎగ్జైట్ అయ్యారు.
నవాజుద్దీన్ యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. అలాంటి నవాజుద్దీన్ తెలుగులో సినిమా చేయడానికి ఓకే అన్నాడంటే ఆయన రోల్ ఎలా ఉంటుందో అని అనుకున్నారంతా. కానీ అతన్ని పక్కా క్లాస్ క్యారెక్టర్ లో చూపిస్తున్నాడు శైలేష్. రీసెంట్గా నవాజ్ బర్త్ డే సందర్భంగా సైంధవ్ నుంచి అతని లుక్ ని రిలీజ్ చేశారు. అందులో ఓ ఖరీదైన కారు ముందు సిగరెట్ వెలిగించుకుంటూ ట్రెండీ డ్రెస్ లో కనిపించాడు నవాజ్. మరి ఇలాంటి క్లాస్ లుక్ లో నవాజ్ ఎలా మెప్పిస్తాడో చూడాలి. కాగా సైంధవ్ డిసెంబర్ లో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.













