అవకాశం వస్తే కేసీఆర్ బయోపిక్ లో నటిస్తా!
బాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం మంటో. నందితాదాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషనలో భాగంగా నవాజుద్దీన్ హైదరాబాద్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా కేసీఆర్ బయోపిక్‌లో నవాజుద్దీన్ నటించనున్నట్లు వచ్చిన వార్తలపై ఆయనను ప్రశ్నించగా, అందుకు సమాధానం ఇచ్చారు. కేసీఆర్ బయోపిక్నకు సంబంధించిన తనని ఎవరై సంప్రదించలేదని అన్నారు. కేసీఆర్ ప్రజా నాయకుడని, అవకాశం వస్తే ఆయన బయోపిక్‌లో నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నవాజుద్దీన్ పేర్కొన్నారు.













