Nani: కీర్తి సినిమాపై నాని పోస్ట్

ఏ నటీనటులైనా తాము నటించిన సినిమా వరకే కలిసి కనిపిస్తారు. ఆ తర్వాత ఎవరి సినిమాల్లో వారు బిజీ అయిపోతారు. కానీ కొందరు మాత్రం ఆ సినిమా చేసే టైమ్ లో వారి మధ్య ఏర్పడిన బాండింగ్ వల్ల తర్వాత కూడా తమ ఫ్రెండ్‌షిప్ ను కంటిన్యూ చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో హీరో నాని(Nani), హీరోయిన్ కీర్తి సురేష్(Keerthy Suresh) కూడా ఉన్నారు. వీరిద్దరూ కలిసి రెండు సినిమాలు చేశారు.
నాని, కీర్తి కలిసి నేను లోకల్(Nenu Local), దసరా(Dasara) సినిమాలు చేయగా, ఆ రెండు సినిమాల్లో వారి మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్ మంచి మార్కులే వేశారు. అయితే ఈ రెండు సినిమాల టైమ్ లో వీరి మధ్య మంచి స్నేహం ఏర్పడటంతో ఇప్పటికీ వారిద్దరూ ఒకరికొకరు రెగ్యులర్ గా టచ్ లో ఉంటూ ఒకరి సినిమాలను మరొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు తాజాగా కీర్తి సినిమాను సపోర్ట్ చేస్తూ నాని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
కీర్తి సురేష్, సుహాస్(Suhas) నటించిన ఉప్పు కప్పురంబు(Uppu Kappurambu) సినిమా జులై 4న ప్రైమ్ వీడియోలో నేరుగా రిలీజ్ కాబోతుంది. రీసెంట్ గా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేయగా, దాన్ని షేర్ చేస్తూ నాని, ట్రైలర్ చాలా సరదాగా, విచిత్రంగా ఉందని, ట్రైలర్ లో మా కీర్తి చాలా అమాయకంగా కనిపిస్తుందని, సుహాస్, మిగిలిన వాళ్లు సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారని, చిత్ర యూనిట్ మొత్తానికి బెస్ట్ విషెస్ తెలియచేశాడు. దానికి కీర్తి థాంక్స్ నాని, ఈ సినిమా నువ్వెప్పుడెప్పుడు చూస్తావా అని వెయిట్ చేస్తున్నానంటూ రిప్లై ఇచ్చింది. తన ఫ్రెండ్ చేసిన సినిమాను, వర్క్ ను ఎంకరేజ్ చేస్తూ నాని చేసిన ఈ పోస్ట్ నెటిజన్లను తెగ ఎట్రాక్ట్ చేస్తోంది.