పదేళ్లు వయసు తగ్గించుకున్న నాని
గతేడాది అంటే సుందరానికీ సినిమాతో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న నాని, అనుకున్న ఫలితాన్ని అందుకోలేకపోయాడనే చెప్పాలి. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించింది. విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా వసూలు చేయలేకపోయింది. కానీ నిర్మాతగా మాత్రం హిట్2తో నాని హిట్ కొట్టాడు.
హిట్ ఫ్రాంచైజీలో భాగంగా రానున్న హిట్3లో తాను హీరోగా కనిపించబోతున్నట్లుగా కూడా రివీల్ చేశాడు. హిట్3లో నాని అర్జున్ సర్కార్ అనే తిక్క పోలీస్ క్యారెక్టర్లో కనిపించనున్నాడు. హిట్ సిరీస్‌లను డైరెక్ట్ చేసిన శేలేష్, ఈ సినిమాకు కూడా దర్శకత్వం వహించనున్నాడు. అయితే ఆ ప్రాజెక్టు ఇప్పట్లో సెట్స్‌పైకి వెళ్లే అవకాశం లేదని కూడా క్లారిటీ వచ్చేసింది.
ఇదిలా ఉంటే సడన్‌గా తన 30వ సినిమాని వైర ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో మోహన్ చెరుకూరి నిర్మాణంలో చేయబోతున్నట్లు నాని అనౌన్స్ చేశాడు. సినిమాలో నాని, ఓ పాపకు తండ్రి క్యారెక్టర్లో నటించబోతున్నాడు. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఓ క్యూట్ వీడియోని న్యూ ఇయర్‌కు రిలీజ్ చేసి అందరి ప్రశంసలు కూడా పొందారు. ఈ వీడియోలో తండ్రీ కూతుళ్ల బాండింగ్ ఎంతందంగా ఉంటుందనే విషయాన్ని చాలా పొయెటిక్‌గా చూపించారు.
ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం కానుంగా, మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానితో జోడీ కట్టనుంది. ఈ సినిమా కోసం నాని కొత్త లుక్‌లోకి ఛేంజ్ అయిపోయాడు. ఆ లుక్ కు సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. స్పెషల్ వీడియోలో కూతురు కోరిక ప్రకారం గడ్డం మీసం తీసేసి జుట్టు మాత్రమే ఉంచుకున్ఆనడు. అంతేకాదు ఈ ఫోటోలో నాని లుక్ ఏకంగా పదేళ్లు తగ్గినట్లుగా అనిపిస్తోంది. ఈ లుక్ చూసి నాని ఫ్యాన్స్ సూపర్ లుక్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మొత్తానికి నాని30 సినిమా ఆసక్తికరంగానే ఉండేట్లుంది.













