ఆ డైరెక్టర్ తో మరోసారి నాని
నేచురల్ స్టార్ నాని(Nani) దసరా(Dasara), హాయ్ నాన్న(Hi Nanna), సరిపోదా శనివారం(Saripoda Sanivaram) హ్యాట్రిక్ విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో వరుసపెట్టి సినిమాలను చేయాలని వేగాన్ని పెంచాడు. ప్రస్తుతం శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో హిట్3(Hit3) చేస్తున్న నాని ఆ సినిమాలో కెరీర్లోనే మొదటిసారిగా పోలీసాఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు.
హిట్3(Hit3)తో పాటూ దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela)తో కూడా నాని ఓ సినిమాను ఒప్పుకున్నాడు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ఆ సినిమా 2026 ఫస్టాఫ్ లో రిలీజ్ కానున్నట్లు సమాచారం. వీటితో పాటూ నాని సుజిత్(Sujeeth) డైరెక్షన్ లో ఓ ప్రాజెక్టును ఒప్పుకున్న విషయం తెలిసిందే. ఓజీ(OG) సినిమా రిలీజ్ తర్వాత సుజిత్ నాని మూవీపై దృష్టి పెట్టనున్నాడు.
అయితే సుజిత్ ప్రాజెక్ట్ కంటే ముందు నాని, శివ నిర్వాణ(Siva Nirvana)తో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడట. కేవలం 3 నెలల్లో ఈ సినిమాను పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తుందట. మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) నిర్మించనున్న ఈ సినిమా ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ కథతో రూపొందనున్నట్లు సమాచారం. ఇప్పటికే నాని, శివ నిర్వాణ కాంబినేషన్ లో వచ్చిన నిన్ను కోరి(Ninnu Kori) సినిమా మంచి విజయం సాధించడంతో వీరి కాంబోపై మంచి అభిప్రాయమే ఉంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.













