శివ నిర్వాణకు మరో ఛాన్స్ ఇచ్చిన నాని.. కారణమదేనా?
నాని(nani)- శివ నిర్వాణ(siva Nirvana) కాంబినేషన్ మరోసారి తెరపైకి వస్తోందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. నిన్ను కోరి(ninnu kori) తో మొదలైన వీరి జర్నీ ఆ తర్వాత టక్ జగదీష్(tuck jagadeesh) వరకు కంటిన్యూ అయింది. ఇప్పుడు మూడోసారి కలిసి పనిచేసేందుకు ఈ కాంబినేషన్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిస్కషన్స్ ప్రారంభ దశలో ఉన్నాయని, త్వరలోనే పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉందని సమాచారం. దీంతో ఒకే డైరెక్టర్ తో నాని మూడోసారి సినిమా చేయబోతుండటం ఆసక్తిని పెంచుతోంది.
ముఖ్యంగా శివ నిర్వాణ ఎమోషనల్ కథలను డీల్ చేసే విధానం నానికి నచ్చుతుందనే ఇప్పటికే పలుమార్లు చెప్పిన విషయం తెలిసిందే. నిన్ను కోరిలో ప్రేమ, ఎమోషన్స్ ను సహజంగా చూపించిన శివ.. ఆ తర్వాత టక్ జగదీష్ లోనూ ఫ్యామిలీ ఎమోషన్స్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. రెండో సినిమా తర్వాత కొంత గ్యాప్ వచ్చినప్పటికీ, ఇప్పుడు మళ్లీ అదే డైరెక్టర్ తో సినిమా చేయడానికి నాని ఇంట్రెస్ట్ చూపుతుండటం ఈ కాంబినేషన్‌పై ఉన్న క్రియేటివ్ నమ్మకాన్ని సూచిస్తోంది. ఈసారి కూడా శివ నాని కోసం ఓ ఎమోషనల్ ఎంటర్టైనర్ను రెడీ చేసినట్లు తెలుస్తోంది.
ఇక ఈ ప్రాజెక్ట్‌ను సాహు గారపాటి(sahu garapati) తన షైన్ స్క్రీన్స్ బ్యానర్(Shine Screens) లో నిర్మించే అవకాశాలున్నట్లు సమాచారం. మరోవైపు నాని వెంకీ అట్లూరి(venky atluri)తోనూ ఓ సినిమా కోసం డిస్కషన్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ది ప్యారడైజ్(the paradise) తర్వాత బ్రేక్‌లో ఉన్న నాని త్వరలో సుజీత్ దర్శకత్వంలోని బ్లడీ రోమియో(bloody romeo) మూవీ షూటింగ్‌ను ప్రారంభించనున్నాడు. ఈ నేపథ్యంలో శివ నిర్వాణతో మూడో సినిమా ఫిక్సైతే, నాని కెరీర్లో మరోసారి ఈ కాంబినేషన్ ప్రత్యేకంగా నిలిచే అవకాశం ఉంది.








