మహేష్12.. నాని 10 సినిమాలతో రికార్డు
నాని హీరోగా రిలీజైన సరిపోదా శనివారం పాజిటివ్ టాక్ తో హిట్ దిశగా దూసుకెళ్తుంది. ఈ సినిమా కచ్ఛితంగా నాని కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ అందుకునే సినిమాగా ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాకు నార్త్ అమెరికాలో కూడా భారీ కలెక్షన్స్ దిశగా దూసుకెళ్తుంది. ఈ సినిమా సెకండ్ డే ఆరంభానికి 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ ను అందుకుంది.
దీంతో తక్కువ టైమ్ లో 1 మిలియన్ డాలర్ కలెక్షన్స్ అందుకున్న టైర్2 హీరోగా నాని నిలిచాడు. అంతేకాదు నానికి నార్త్ అమెరికాలో సూపర్బ్ క్రేజ్ ఉంది. టాలీవుడ్ లో అత్యధిక సార్లు నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్ కలెక్షన్స్ అందుకున్న హీరోల లిస్ట్ లో నాని సెకండ్ ప్లేస్ లో ఉండగా, మొదటి ప్లేస్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఉన్నాడు.
మహేష్ 12 సార్లు నార్త్ అమెరికాలో 1 మిలియన్ డాలర్స్ అందుకుంటే, నాని ఏకంగా 10 సార్లు 1 మిలియన్ డాలర్ మార్క్ ను టచ్ చేశాడు. ఇతర ఏ హీరోలు కూడా ఈ ఫీట్ ను సాధించలేకపోయారు. సరిపోదా శనివారం కంటే ముందొచ్చిన సినిమాలతో కూడా నాని అక్కడ మంచి రికార్డే సృష్టించాడు. వరుసగా నాలుగు సినిమాలతో ఓవర్సీస్ లో తనకి తిరుగులేదని ప్రూవ్ చేసుకున్నాడు. టైర్ 2 హీరోల్లో ఇంకెవరూ కూడా నాని దరిదాపుల్లోనే లేరు.













