Nani: చిరంజీవితో సినిమా చాలా పెద్ద బాధ్యత
నాని(Nani) ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు నిర్మాతగా సక్సెస్ అందుకుంటూ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ప్రస్తుతం శైలేష్ కొలను(Sailesh Kolanu) దర్శకత్వంలో హిట్3(Hit3) చేస్తున్న నాని ఆ తర్వాతి సినిమాను శ్రీకాంత్ ఓదెల(Srikanth Odela) దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే. ది ప్యారడైజ్(The Paradise) టైటిల్ తో తెరకెక్కుతున్న ఆ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేయనున్నాడు నాని.
శ్రీకాంత్ దర్శకత్వంలో హీరోగా ప్యారడైజ్ సినిమా చేస్తున్న నాని, అదే శ్రీకాంత్ తో కలిసి నిర్మాతగా మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా ఓ సినిమాను నిర్మించనున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న నాని మెగాస్టార్ తో చేయబోయే సినిమా గురించి మాట్లాడారు. చిరంజీవి హీరోగా తాను నిర్మాతగా ఓ సినిమా చేస్తానని ఎప్పుడూ అనుకోలేదని నాని ఈ సందర్భంగా చెప్పాడు.
ఒక యాక్టర్ గా చిరంజీవితో సినిమా తనకు చాలా పెద్ద బాధ్యత అని చెప్తోన్న నాని, ఆ బాధ్యతను సరిగా నిర్వర్తించడానికి ట్రై చేస్తానని చెప్పాడు. మెగాస్టార్ తో తాము చేయబోయే సినిమా చాలా భారీగా ఉంటుందని, శ్రీకాంత్ కు సినిమా పైన, మెగాస్టార్ పైన ఉన్న పిచ్చి ఆ సినిమాలో చూస్తారని, యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఆ ప్రాజెక్టు వచ్చే ఏడాది మొదలవనుందని అనిరుధ్(Anirudh Ravichander) ఆ సినిమాకు సంగీతం అందించనున్నాడని నాని వెల్లడించాడు.













