షాకింగ్: బీబీ3 లో అఘోరా గెటప్ లేదా?
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను ల కాంబోలో ఇప్పటి వరకు వచ్చిన సింహా, లెజెండ్ లు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. దీంతో వీరి కాంబోలో హ్యాట్రిక్ మూవీ కోసం ఫ్యాన్స్ తో పాటూ, సినీ అభిమానులు కూడా ఎన్నో ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు. ఫైనల్ గా వీరి కాంబో లో సినిమా స్టార్ట్ అయింది. కాకపోతే కరోనా కారణంగా లేట్ అవుతూ వచ్చిన ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ రీసెంట్ గానే మొదలు పెట్టారు. భారీ అంచనాలున్న ఈ సినిమాకు గాడ్ ఫాదర్ అనే టైటిల్ ను పరిశీలనలో ఉంచారు.
అసలు విషయానికి వస్తే.. ఈ సినిమా ప్రారంభం అయినప్పటి నుంచి ఒక విషయం ఫ్యాన్స్ కు ఆందోళన కలిగిస్తూనే ఉంది. బాలయ్య ఈ సినిమాలో అఘోరా గెటప్ లలో కనిపిస్తాడని, దానికి సంబంధించిన సీన్స్ ఈ సినిమాలో చాలా కీలకంగా నిలవనున్నాయని ప్రచారం జరిగింది. బాలయ్యను ఆ గెటప్ లో చూసిన యాంటీ ఫ్యాన్స్ బాలయ్యను ఆడుకోవడం ఖాయమని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న సమయంలో ఫ్యాన్స్ కు ఊరట కలిగించే విషయమొకటి వినిపిస్తుంది.
అదేంటంటే.. సినిమాలో బాలయ్య అఘోరా గెటప్ లో కనిపించబోవడం లేదంటూ వార్తలొస్తున్నాయి. లాక్ డౌన్ టైమ్ లో స్క్రిప్ట్ లో కొన్ని చిన్న చిన్న మార్పులు చేశారని, అందులో భాగంగానే ఈ అఘోరా గెటప్ ను తొలగించినట్లు తెలుస్తుంది. మరి ఈ సినిమాలో అఘోరా గెటప్ తీసేశారంటే, ఆ గెటప్ లో మరో గెటప్ క్రియేట్ చేశారా లేదంటే అఘోరా గెటప్ కే ఏమైనా చిన్న చిన్న మార్పులు చేశారా అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ఈ నిర్ణయంతో బాలయ్య ఫ్యాన్స్ మాత్రం చాలా రిలాక్స్ అయ్యారు.













