బాలయ్య, బోయపాటి సినిమాను అనుష్క సినిమాతో పోలుస్తున్నారే..
బాలయ్య హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా షూటింగ్ ఇప్పటికే ముగింపు దశకు చేరుకున్నట్లుగా సమాచారం. మే నెలలో రాబోతున్న ఈ సినిమా టైటిల్ ఇంకా ఫిక్స్ అవలేదు. ఉగాది రోజున ఈ టైటిల్ అనౌన్స్ చేస్తారని సమాచారం. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన రెండు సినిమాల టైటిల్స్ లానే ఈ సినిమా టైటిల్ కూడా చాలా పవర్ ఫుల్ గా ఉండేలా బోయపాటి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే.. సినిమా స్టోరీ లైన్ ఇదే అంటూ బయటకు ఒక స్టోరీ లైన్ చక్కర్లు కొడుతుంది. అది విన్న వారు అనుష్క నటించిన భాగమతి సినిమాను గుర్తు చేసుకుంటున్నారు. భాగమతి సినిమాలో అనుష్క కలెక్టర్ గా ఆ సినిమాలో మంచి పనులు చేసే సామాజిక వేత్త అయిన హీరోతో ప్రేమలో పడుతుంది. కలెక్టర్ సామాన్య వ్యక్తితో ప్రేమలో పడినట్లుగా భాగమతిలో ఏ విధంగా అయితే చూపించారో , ఇప్పుడు బీబీ3 లో కూడా కలెక్టర్ అయిన ప్రగ్యా జైస్వాల్ తన జిల్లాలో మంచి పనులు చేస్తూ జనాలకు దేవుడులా నిలిచిన బాలయ్యను ఇష్టపడి, ప్రేమిస్తుందట. ఇద్దరి ప్రేమ పెళ్లి వరకు వెళ్తుందట.
అయితే వీరిద్దరి ప్రేమ, పెళ్లి లను హైలైట్ చేయకుండా బోయపాటి కథ ముందుకు వెళ్లేట్లు స్టోరీ రాసుకున్నాడట. బాలయ్య, ప్రగ్యా ల మధ్య రొమాన్స్ మరీ ఎక్కువగా ఆశించిన స్థాయిలో ఏం ఉండదంటున్నారు. ఈ లవ్ ట్రాక్ వరకు భాగమతి తరహాలో ఉన్నా బీబీ3 సినిమా కథ వేరేగా ఉంటుందని చెప్తున్నారు. బోయపాటి, బాలయ్యల కాంబినేష్ లో గతంలో వచ్చిన సింహా, లెజెండ్ మాదిరిగానే ఈ సినిమా కూడా ఘన విజయం సాధిస్తుందని అందరూ అభిప్రాయ పడుతున్నారు.













