నా సామిరంగ కోసం రంగంలోకి దిగిన కింగ్
గత కొన్నేళ్లుగా కింగ్ నాగార్జున ప్రతి సంక్రాంతికి తన సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఈసారి కూడా నాగ్ అదే ప్లాన్ తో నా సామిరంగ షూటింగ్ ను పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి థియేటర్లలోకి దింపాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అల్లరి నరేష్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు చేస్తున్నారు.
నా సామిరంగను అనుకున్న టైమ్ కు తీసుకురావడానికి మేకర్స్ చాలానే కష్టపడుతున్నారు. దానికి తోడు సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ కు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై హైప్ బాగా పెరిగింది. అంతా బానే ఉంది కానీ ఈ సినిమాకు సరిపడా థియేటర్లు దొరకడం లేదట.
దీంతో తీవ్ర అంసతృప్తితో ఉన్న నాగ్ ఈ విషయాన్ని నిర్మాతల దగ్గరకు తీసుకెళ్లాడట. దీంతో రంగంలోకి దిగిన ప్రొడ్యూసర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఈ సమస్యను పరిష్కరించేందుకు మరియు రిలీజ్ డేట్స్ ప్లానింగ్ గురించి చర్చలు జరిపేందుకు సమావేశం కానున్నారట. మరి ఈ చర్చలు ఫలించి నా సామిరంగకు సరిపడా థియేటర్లు దొరుకుతాయో లేదో చూడాలి.













