ఆ డేట్కే ఓటేసిన నా సామిరంగ
సంక్రాంతికి రిలీజ్ కానున్న అన్ని సినిమాల్లో ప్రమోషన్స్ ను వేగవంతం చేసిన సినిమా మాత్రం నా సామిరంగ. ప్రమోషన్స్ అయితే జోరగా చేస్తున్నారు కానీ రిలీజ్ డేట్ ను మాత్రం ఇప్పటివరకు అనౌన్స్ చేయలేదు. ఇప్పుడు నా సామిరంగ కు జనవరి 14ను లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఈ డేట్ ముందే లీకయ్యింది కానీ మధ్యలో గుంటూరు కారం కంటే ఓ రెండు రోజులు ముందొస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలు కూడా మేకర్స్ చేశారు.
కానీ గుంటూరు కారం కంటే ముందుకు రిలీజ్ చేయడానికి వీలుపడట్లేదు. దానికి కారణం ఇంకా పూర్తవని షూటింగ్. ఆ తర్వాత సెన్సార్ కు టైమ్ పట్టనుండటం. ఫైనల్ కాపీ రెడీ చేసి సెన్సార్ కు పంపి బాలెన్స్ ఉన్న రీ రికార్డింగ్ వర్క్స్ ను స్పీడప్ చేసినా ఎంతలేదన్నా పదో తేదీ వస్తోంది. ఒకవేళ అన్నీ కుదిరి సినిమాను గుంటూరు కారంకు రెండు రోజుల గ్యాప్ లో రిలీజ్ చేసినా థియేటర్ల సమస్య వస్తోంది.
అయితే నాగ్ సినిమా సంక్రాంతి రేసులో అందరికంటే లేటుగా రావడం వల్ల కూడా లాభనష్టాలున్నాయి. మిగిలిన నాలుగు సినిమాలకు వచ్చే టాక్, నా సామిరంగ ఓపెనింగ్స్ ను డిసైడ్ చేస్తుంది. వాటిలో ఏదైనా సినిమా డిజాస్టర్ అయితే అది ఈ సినిమాకు కలిసొచ్చే ఛాన్సుంది. కానీ నాగ్ మాత్రం సోగ్గాడే సెంటిమెంట్ ను మైండ్ లో పెట్టుకుని సినిమాను జనవరి 14కే తీసుకురావాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.













