మన్మథుడు 2 ప్రారంభం
మళ్లీ మళ్లీ చూడాలనిపించే నాగార్జున సినిమాల్లో మన్మథుడు ఒకటి. ఈ చిత్రం స్ఫూర్తితో, యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ మన్మథుడు 2 ని తెరకెక్కిస్తున్నారు. నాగ్ సరసన రకుల్‌ప్రీత్ సింగ్ కథానాయికగా నటిస్తుంది. నాగార్జున అక్కినేని, పి.కిరణ్ (జెమిని కిరణ్) సంయుక్తంగా నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌లో చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు సన్నివేశానికి అమల అక్కినేని క్లాప్‌నివ్వగా, నాగచైతన్య కెమెరా స్విచ్చాన్ చేశారు. పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రంగా తెరకెక్కిస్తున్నారు రాహుల్ రవీంద్రన్. రెగ్యులర్ చిత్రీకరణ యూరప్‌లో ప్రారంభం అవుతుంది. ఆర్.ఎక్స్ 100తో మంచి పేరు తెచ్చుకున్న చైతన్య భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారని తెలిపాయి చిత్రవర్గాలు. లక్ష్మి, వెన్నెల కిషోర్, రావు రమేష్, నాజర్, ఝాన్సీ, దేవదర్శిని తదితరులు ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఎం.సుకుమార్.













