100వ సినిమాకు నాగ్ రిస్క్
ఏ హీరో అయినా సరే తమ మైలు రాయి సినిమాను మంచి కథతో జీవితాంతం గుర్తుండిపోయేలా తీయాలని అనుకుంటారు. అందుకే చిరంజీవి త్రినేత్రడు అనే మూవీని తన సొంత బ్యానర్లో భారీ బడ్జెట్‌తో నిర్మించుకున్నాడు. తర్వాత బాలయ్య తన 100వ సినిమాగా ఏరి కోరి మరీ గౌతమీపుత్ర శాతకర్ణిని తీసి మంచి హిట్ అందుకున్నాడు. విక్టరీ వెంకటేష్ కు ఈ నెంబర్ మూవీ తీయడానికి ఇంకా టైమ్ పట్టనుంది.
ఇక కింగ్ నాగ్ విషయానికి వస్తే ప్రస్తుతం నాగ్ తన 99వ సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమా అయిపోగానే నాగ్ తన ఫోకస్‌ను 100వ మూవీ మీద పెట్టాల్సి ఉంది. మొదట్లో తన 100వ సినిమా బాధ్యతను మోహన్ రాజాకు ఇచ్చాడనుకున్నారు కానీ ఆయన తని ఒరువన్2 పనుల్లో బిజీగా ఉండటంతో ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లేదంటున్నారు. దీంతో నాగ్ 100వ సినిమా డైరెక్టర్‌గా మరో కొత్త డైరెక్టర్ పేరు వినిపిస్తుంది.
కోలీవుడ్ డైరెక్టర్ నవీన్ చెప్పిన ఓ లైన్ నాగ్ కు బాగా నచ్చడంతో ఈ సినిమానే తన 100వ సినిమాగా చేయాలని నాగ్ చూస్తున్నట్లు ఇన్ సైడ్ టాక్. అయితే నాగ్ నవీన్ తో 100వ సినిమా చేయడం రిస్క్ అంటున్నారు కొంతమంది. ఇప్పటివరకు నవీన్ తీసింది రెండే సినిమాలు. అందులో ఒకటి 2013లో రిలీజైన మూడర్ కుడం. మంచి సినిమాగా పేరు కూడా తెచ్చుకుంది.
ఇక రెండో సినిమాగా 2021లో విజయ్ ఆంటోనీ, అరుణ్ విజయ్ హీరోలుగా అగ్ని సిరగుగల్ అనే మూవీని తీశారు. ఈ సినిమా రెండేళ్లవుతున్నా ఇప్పటికీ రిలీజ్ కు నోచుకోలేదు. కారణాలేంటంటే నోరు మెదపడం లేదు. ప్రొడ్యూసర్ గా, రైటర్ గా పేరున్న నవీన్ కు డైరెక్టర్ గా మాత్రం ఇంకా ప్రత్యేక ముద్ర పడలేదు. ఇలాంటి నవీన్ చేతిలో నాగ్ 100వ సినిమా పెట్టడం రిస్కే అని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. కానీ నాగ్ ఏ రీజన్ లేకుండా తన 100వ సినిమాను నవీన్ చేతిలో పెట్టడు కాబట్టి ఫ్యాన్స్ కు ఆ దిగులు అక్కర్లేదు. ప్రస్తుతం నాగ్ చేస్తున్న తన 99వ సినిమా నా సామి రంగా సంక్రాంతికి రిలీజ్ కానుంది.













