Geethanjali: నాగార్జున గీతాంజలి మళ్ళీ థియేటర్స్ లో…
బాగ్యలక్ష్మి ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై శ్రీమతి సి. పద్మజ (Proprietor) నిర్మించిన గీతాంజలి (1989) చిత్రం యొక్క వరల్డ్ వైడ్ (చెన్నై మినహాయించి) రీ-రిలీజ్ హక్కులని శ్రీ పద్మినీ సినిమాస్ అధినేత శ్రీ బూర్లె శివప్రసాద్ గారు గతంలో పొంది వున్నారు. మణిరత్నం గారు దర్శకత్వం వహించి అక్కినేని నాగార్జున గిరిజ షట్టర్ విజయకుమార్ గార్లు నటించిన ఈ చిత్రం యొక్క 4K డిజిటల్ కార్యక్రమాలను అత్యున్నత ప్రామాణికాలతో నిర్వహించి త్వరలో రీ-రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ అద్భుతమైన చిత్రాన్ని ఎంతో ప్రేమతో ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము.
శ్రీ పద్మినీ సినిమాస్ అధినేత శ్రీ బూర్లె శివప్రసాద్ గారు మాట్లాడుతూ “ఈ చిత్రం నాకు ఎంతో ఇష్టమైనది. అందుకని ఈ గీతాంజలి యొక్క రీ-రిలీజ్ హక్కులను పొందడం నాకు ఎంతో ఆనందంగా ఉందని” తెలిపారు.






