నెక్ట్స్ సంక్రాంతికి నాగ్ ప్లాన్
సంక్రాంతి పండగ తనకు బాగా కలిసొస్తుందని నమ్మిన నాగార్జున, నా సామిరంగ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేసి మరోసారి తన నమ్మకాన్ని గెలిపించుకున్నాడు. నా సామిరంగ బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. దీంతో ఈ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో నాగ్ మాట్లాడుతూ వచ్చే సంక్రాంతికి మళ్లీ కలుద్దామంటూ చెప్పడం ఫ్యాన్స్ లో చర్చకు దారి తీసింది.
అంటే వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా తన సినిమా రిలీజ్ కాబోతుందని నాగ్ చెప్పకనే చెప్పాడు. కానీ ఏ సినిమా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం నాగార్జున చేతిలో రెండు సినిమాలున్నాయి. అందులో ఒకటి ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న మల్టీస్టారర్. ఈ సినిమా పొలిటికల్ కం యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. రీసెంట్ గా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టుకున్న ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఇక రెండో సినిమా తమిళ డైరెక్టర్ అనిల్ తో చేయనున్న లవ్ యాక్షన్ రొమాన్స్. ఈ సినిమా షూటింగ్ ఇంకా స్టార్ట్ కాలేదు. పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు టైమ్ పట్టేలా ఉంది. నాగ్ మాటలను బట్టి ఈ రెండింటింలో ఓ సినిమా వచ్చే సంక్రాంతికి రావాలి. ఒకవేళ ఈ రెండు కాకపోతే నా సామిరంగ-2 లేదంటే బంగార్రాజు-3ని రేసులో నిలబెట్టేలా నాగ్ ప్లాన్ చేయనున్నాడు. ఏదేమైనా ఇకనుంచి కేవలం యాక్షన్ డ్రామాలు మాత్రమే చేయకూడదని నాగ్ చాలా గట్టిగా డిసైడైనట్లు తెలుస్తోంది.













