నాగవంశీ నమ్మకం గెలిచింది
మొన్న దీపావళికి రిలీజైన లక్కీ భాస్కర్(Lucky Baskhar), క(KA), అమరన్(Amaran) అన్ని సినిమాలూ పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో లక్కీ భాస్కర్ విపరీతమైన కలెక్షన్లను సంపాదించలేకపోయింది. ముఖ్యంగా అమరన్ నుంచి గట్టి పోటీ ఎదురవడం, క సినిమాకు ఊహించని రీతిలో ఆదరణ దక్కడంతో ఆ ఎఫెక్ట్ లక్కీ భాస్కర్ పై పడింది. అయితే ఈ విషయంపై లక్కీ భాస్కర్ నిర్మాత నాగవంశీ(Naga Vamsi) సినిమా రిలీజైన రెండో రోజు లక్కీ భాస్కర్ కు లాంగ్ రన్ ఉంటుందని చెప్పాడు.
పెద్ద పెద్ద సినిమాలే రెండు వారాలకు మించి ఆడని ఈ రోజుల్లో లక్కీ భాస్కర్ ఈ ఫీట్ ను సాధించగలదా అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సినిమా మెల్లగా రూ.111 కోట్ల గ్రాస్ దాటి ఇంకా మంచి రన్ కొనసాగిస్తుంది. గత వారం రిలీజైన కంగువ(Kanguva), మట్కా(Matka) సినిమాలు కూడా డిజాస్టర్ అవడం లక్కీ భాస్కర్ కు బాగా కలిసొచ్చింది.
అమరన్ మూవీ స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం మొదట లక్కీ భాస్కర్‌కే ఓటేస్తున్నారు. కేవలం తెలుగు వెర్షన్ లో మాత్రమే కాదు తమిళనాడు, కర్ణాటక, కేరళలో కూడా లక్కీ భాస్కర్‌కు మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మెయిన్ సెంటర్లలో ఇప్పటికీ వీకెండ్స్ లో హౌస్ ఫుల్స్ కనిపిస్తున్నాయి. ఇదంతా చూసి నాగవంశీ ముందు చెప్పిన మాటే నిజమైందిగా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి లక్కీ భాస్కర్ రూపంలో దుల్కర్(Dulquer) టాలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.













