Naga Vamsi: నాగ వంశీ పోస్ట్ తో క్లారిటీ వచ్చేసిందిగా!

సోషల్ మీడియాలో టాలీవుడ్ లోని ఓ క్రేజీ ప్రాజెక్టులో మార్పులు జరుగుతున్నాయని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి. అయితే ఆ వార్తల్లో నిజమెంత అని అందరూ లైట్ తీసుకోగా, ఇప్పుడు ఆ రూమర్లు నిజమనేలా ఓ నిర్మాత ఇచ్చిన హింట్ నెట్టింట వైరల్ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) తో త్రివిక్రమ్(Trivikram) చేయాల్సిన భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందని గత కొన్నాళ్లుగా వార్తలొస్తున్నాయి.
అంతేకాదు, ఆ ఆగిపోయిన ప్రాజెక్టును త్రివిక్రమ్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(NTR) తో చేస్తున్నాడని కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ రూమర్లలో నిజమెంత అని అందరూ అనుకుంటున్న టైమ్ లో టాలీవుడ్ నిర్మాత నాగ వంశీ(Naga Vamsi) ఎవరూ ఊహించని విధంగా ఓ పోస్ట్ వేశాడు. నాగ వంశీ పోస్ట్ తో అందరికీ క్లారిటీ వచ్చేసింది. తన మోస్ట్ ఫేవరెట్ అన్న మోస్ట్ పవర్‌ఫుల్ గాడ్ గా కనిపించనున్నాడని ఓ శ్లోకాన్ని పోస్ట్ చేశాడు వంశీ.
నాగ వంశీ పోస్ట్ చేసిన ఆ శ్లోకం కుమార స్వామి గురించి. అయితే ఎప్పట్నుంచో త్రివిక్రమ్, బన్నీ తో చేయబోయే సినిమా ఓ మైథలాజికల్ థ్రిల్లర్ అని చెప్తూ ఉండటం, ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఆగిపోయిందని చెప్పడం, దానికి తోడు నాగ వంశీ ట్వీట్ కూడా చూస్తుంటే త్రివిక్రమ్- ఎన్టీఆర్ ప్రాజెక్టు నిజమేనని క్లారిటీ వచ్చేస్తుంది. అయితే నాగవంశీ కేవలం హింట్ మాత్రమే ఇచ్చాడు కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
https://x.com/vamsi84/status/