Naga Chaitanya: ప్రైమ్ టైమ్ను భలే వాడుకుంటున్న చైతూ
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) సోలో సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తుంటే ఆయనకి నచ్చిన కథ దొరక్క కింగ్ మల్టీస్టారర్ సినిమాలతోనే సరిపెడుతున్నాడు. మరోవైపు అఖిల్(Akhil) చూస్తే ఏజెంట్(Agent) వచ్చి దాదాపు రెండేళ్లవుతున్నా కొత్త సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా నెట్టుకొస్తున్నాడు. ఇలాంటి టైమ్ లో నాగ చైతన్య(Naga Chaitanya) మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు.
ఇప్పటివరకు ఏ తెలుగు యంగ్ హీరో వెబ్ సిరీస్ లకు మొగ్గు చూపలేదు కానీ చైతూ(Chaithu) మాత్రం ధూత(Dhootha) సిరీస్ చేసి మంచి హిట్ అందుకున్నాడు. ప్రైమ్(Prime Video) త్వరలోనే ధూత2(Dhootha2) ని కూడా ప్లాన్ చేస్తున్నదని సమాచారం. ప్రస్తుతం చైతూ చందూ మొండేటి(Chandoo Mondeti) దర్శకత్వంలో తండేల్(Thandel) సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరి లో ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ కానుంది.
తండేల్ తర్వాత విరూపాక్ష(Virupaksha) డైరెక్టర్ కార్తీక్ దండు(KArthik Dandu)తో థ్రిల్లర్ సినిమాను చేయనున్నాడు చైతూ. తాజాగా ఆర్కా మీడియా(Arca Media) కూడా చైతూతో ఓ సిరీస్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అది కూడా థ్రిల్లర్ కథాంశంతోనే తెరకెక్కనుందని సమాచారం. ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు సిరీస్ లతో అసలు ఏ మాత్రం ఖాళీ లేకుండా తన ప్రైమ్ టైమ్ ను చైతూ ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్న వైనాన్ని చూసి అక్కినేని ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు.













