తర్వాతి సినిమాకు చైతూ గ్రీన్ సిగ్నల్
కొన్నేళ్లుగా అక్కినేని నాగచైతన్య కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆయన నుంచి వచ్చిన చివరి రెండు సినిమాలు కస్టడీ, థాంక్యూ సినిమాలు డిజాస్టర్లయ్యాయి. రీసెంట్ గా డిజిటల్ ఎంట్రీ ఇచ్చి చేసిన దూత వెబ్ సిరీస్ కు మంచి పేరొచ్చింది. ఇప్పుడు చైతన్యకు ఒక పెద్ద థియేట్రికల్ హిట్ అవసరం ఎంతో ఉంది.
ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో చేస్తున్న తండేల్ అలాంటి హిట్ ను ఇస్తుందని చైతూ ఎంతో నమ్మకంగా ఉన్నాడు. వరుస ఫ్లాప్స్ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని, ఎంతో వర్క్ చేశాక ఈ సినిమా చేస్తున్నాడు చైతూ. ఈ గ్యాప్ లో వేరే సినిమా కథలు కూడా ఏమీ వినలేదు. తండేల్ అవుట్ పుట్ బాగా వస్తుండటంతో సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు చైతూ.
ఆ కాన్ఫిడెన్స్ తోనే కొత్త కథలు వినడం స్టార్ట్ చేశాడట చైతూ. తాజాగా చైతూ ఓ సినిమాను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. విరూపాక్షతో మంచి హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ కార్తీక్ దండుతో సినిమా చేయడానికి చైతూ ఓకే అన్నాడట. రీసెంట్ గా చైతూకు స్టోరీ వినిపించి ఓకే చేయించుకున్నాడట కార్తిక్. ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ సినిమాను నిర్మించనుందట. ఈ సారి కార్తిక్ విరూపాక్షకు భిన్నమైన కథతో సినిమా చేయనున్నాడట. ఇందులో కమర్షియల్ టచ్ కూడా ఉంటుందని తెలుస్తోంది.













