చైతూ మేకోవర్ అందుకోసమేనా?
గత కొన్ని సినిమాలుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న అక్కినేని నాగచైతన్య, తన తర్వాతి సినిమాను కార్తికేయ ఫేమ్ చందూ మొండేటి తో చేయనున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కనుంది. చైతూ కెరీర్లోనే భారీ బడ్జెట్తో ఈ సినిమా రూపొందనుందని తెలుస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని సమాచారం.
ఈ సినిమాలో చైతన్య మత్స్యకారుడి లుక్ లో కనిపించనున్నాడు. దాని కోసమే తను మేకోవర్ చేస్తున్నట్లు చైతూ తెలిపాడు. రీసెంట్ గా యూట్యూబ్ చానెల్ ను స్టార్ట్ చేసిన నాగ చైతన్య ఫ్యాన్స్ తో ముచ్చటించాడు. అందులో ఒకరు గడ్డం, జుట్టు ఎందుకలా పెంచుతున్నారని అడగ్గా, చైతూ దానికి సరదాగా రెస్పాండ్ అయ్యాడు.
ఆరు నెలలుగా జాబ్ లేక ఇంట్లో ఖాళీగా ఉంటున్నా కదా పనేం లేక జుట్టు, గడ్డం పెంచుతున్నా అని ఫన్నీగా ఆన్సర్ ఇచ్చిన చైతూ, వెంటనే చందూ సినిమా కోసం ఈ మేకోవర్ చేస్తున్నట్లు తెలిపాడు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా కోసం టెస్ట్ లుక్ కూడా జరిగిందని, అవుట్పుట్ బాగా వచ్చిందని చైతూ చెప్పాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుండగా, చైతన్య నటించిన దూత వెబ్ సిరీస్ డిసెంబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది.













