Naga Chaitanya: శోభిత లేకుండా ఉండలేను

తండేల్(thandel) మూవీతో కెరీర్లోనే పెద్ద హిట్ అందుకున్న నాగచైతన్య(naga chaitanya) ఇప్పుడు కార్తీక్ దండు(Karthik dandu) దర్శకత్వంలో ఓ మిస్టిక్ థ్రిల్లర్ సినిమాను చేస్తున్నాడు. రీసెంట్ గా నాగచైతన్య, జగపతి బాబు(Jagapathi babu) హోస్ట్ చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా(Jayammu Nischayammura) అనే టాక్ షో కు వచ్చి, తన ప్రేమ కథ గురించి, భార్య శోభిత గురించి పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టాడు.
తండేల్ మూవీ సక్సెస్ అయినప్పటికీ శోభిత మాత్రం ఆ విషయంలో హ్యాపీగా లేదని చెప్పిన చైతూ, మూవీలోని కొన్ని అంశాలు శోభితను అసహనానికి గురి చేశాయని, తను శోభితను బుజ్జితల్లి(Bujji thalli) అనే పిలుస్తానని, తండేల్ లో పాట విని తానే కావాలని సినిమాలో ఆ పేరుని పెట్టమని డైరెక్టర్ ని అడిగానని శోభిత అనుకుందని, ఆ రీజన్ తో కొన్నాళ్లు శోభిత తనతో మాట్లాడలేదని, అయినా చిన్న చిన్న గొడవలుంటేనే ప్రేమ మరింత బలంగా ఉంటుందని చైతన్య చెప్పాడు.
ఇక తమ లవ్ స్టోరీ గురించి చెప్తూ, తమ పరిచయం ఆన్‌లైన్ లో జరిగిందని, జీవిత భాగస్వామిని సోషల్ మీడియాలో కలుస్తానని తానెప్పుడూ అనుకోలేదని, తన క్లౌడ్ కిచెన్ గురించి చేసిన ఓ పోస్ట్ కు శోభిత కామెంట్ చేసిందని, అప్పట్నుంచే తాము మాట్లాడుకోవడం మొదలైందని, ఆ తర్వాత మెల్లిగా ప్రేమ మొదలైందని చెప్పిన చైతూ, తన లైఫ్ లో శోభిత లేకుండా ఉండలేనని అన్నాడు.