Naga Chaitanya: చైతన్య 25వ సినిమాకు సర్వం సిద్ధం

తండేల్(thandel) సినిమాతో సూపర్ హిట్ ను అందుకున్న అక్కినేని నాగచైతన్య(akkineni naga chaithanya) ఆ హిట్ తో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. తండేల్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న చైతన్య తన తర్వాతి సినిమాను కార్తీక్ దండు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే. చైతూ కెరీర్లో 24(NC24)వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీ మిథికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. మీనాక్షి చౌదరి(meenakshi chaudhary) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు వృష కర్మ(Vrusha Karma) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ జరుగుతూ సెట్స్ పై ఉండగానే చైతన్య తన తర్వాతి సినిమా మరియు ల్యాండ్ మార్క్ మూవీ అయిన 25వ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందులో భాగంగానే శివ నిర్వాణ(siva nirvana) చెప్పిన కథకు చైతూ ఓకే చెప్పాడని, రెండేళ్ల నుంచి వీరిద్దరూ కలిసి ఓ సినిమా చేయాలని చర్చలు జరపగా, రీసెంట్ గా చైతూ శివకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది.
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్(mythri movie makers) నిర్మించనుందట. ఇప్పటికే నిర్మాతలు నాగ చైతన్యకు, శివ నిర్వాణకు ఈ ప్రాజెక్టు కోసం అడ్వాన్సులు కూడా ఇచ్చారని సమాచారం. ప్రస్తుతం శివ ఈ స్క్రిప్ట్ కు డైలాగ్ వెర్షన్ ను రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది. గతంలో చైతూ, శివ నిర్వాణ కలిసి మజిలీ(majili) అనే సినిమా చేయగా, ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. మజిలీ తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలిసి అందరూ చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నారు. ఈ ఏడాది చివరి నుంచి ఈ మూవీ మొదలయ్యే అవకాశాలున్నాయి.