ధనుష్ తో మల్టీస్టారర్ గురించి నాగ్ క్లారిటీ
మల్టీ స్టారర్ సినిమాలకు ఏ భాషలోనైనా మంచి క్రేజ్ ఉంటుంది. అందులోనూ స్టార్ హీరోల మల్టీ స్టారర్ సినిమాలైతే ఆ క్రేజ్ చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సినీ ప్రేక్షకుల దృష్టంతా ధనుష్- నాగార్జున కలయికలో రానున్న మల్టీస్టారర్ పైనే ఉంది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సినిమా వస్తుందని ఎప్పుడో రెండేళ్ల కిందటే అనౌన్స్ చేశారు.
కానీ ఇప్పటి వరకు ఆ సినిమా మొదలైంది లేదు. మధ్యలో ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా ఆగిపోయిందా అని కూడా అనుకున్నారు. కానీ రీసెంట్ గా ఈ సినిమాలో నాగార్జున కూడా నటిస్తున్నారని అనౌన్స్ చేస్తూ సినిమా ఆగిపోలేదన్న క్లారిటీ ఇచ్చారు. రీసెంట్ గా ఈ సినిమా గురించి నాగార్జున తన నా సామిరంగ ప్రమోషన్స్ లో మాట్లాడాడు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తను చేయనున్న సినిమా ఈ నెల 25న అఫీషియల్ గా స్టార్ట్ కానుందని, షూటింగ్ కూడా అతి త్వరలోనే మొదలుకానుందని, దానికి అనుగుణంగానే ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లు చెప్పాడు. అన్నీ అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే ఈ మల్టీస్టారర్ ఈ ఏడాది సెకండాఫ్ లో థియేటర్లలోకి తీసుకురావాలని శేఖర్ కమ్మలు ప్లాన్ చేస్తున్నాడట.













