కల్కి కోసం నాగ్ అశ్విన్ భారీ స్కెచ్
తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ స్థాయి సినిమాలతో పోటీ పడేలా రాజమౌళి తన సినిమాల ద్వారా ఎంతో కృషి చేస్తున్నాడు. మహేష్ తో తను తీయబోయే సినిమాతో హాలీవుడ్ ను షేక్ చేయాలని రాజమౌళి ఫిక్స్ అయ్యాడు. ఇప్పుడు రాజమౌళి చూపించిన బాటలోనే నాగ్ అశ్విన్ కూడా వెళ్తున్నాడు. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కల్కి 2898ఏడి.
ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ తోనే ఆడియన్స్ కు సినిమా రేంజ్ ఏంటన్నది అర్థమైంది. హాలీవుడ్ అప్పీల్ తో వస్తున్న ఈ సినిమాతో నాగ్ అశ్విన్, రాజమౌళిని మించిపోయేలా కనిపిస్తున్నాడు. కల్కిపై ఆడియన్స్ లో అంచనాలు పెంచేలా సినిమా కోసం ఓ రేంజ్ లో ప్రమోషన్స్ ను ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత హాలీవుడ్ మీడియాకు రాజమౌళి ఇంటర్వ్యూ ఇవ్వగా, ఇప్పుడు నాగ్ అశ్విన్ కల్కి సినిమా రిలీజ్ కు ముందే హాలీవుడ్ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చేలా ప్లాన్ చేశాడట. ఇలా చేస్తే సినిమా గురించి హాలీవుడ్ లో కూడా క్రేజ్ ఏర్పడటం ఖాయం. మే 9న రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే అందరికీ భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ రూ.500 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.













