Nabha Natesh: మెకానిక్ షెడ్ లో కారు రిపేర్ చేస్తూ నభా అందాల ఆరబోత

నన్ను దోచుకుందువటే(Nannu Dochukundhuvate) సినిమాతో తెలుగు ఆడియన్స్ కు పరిచయమైన నభా నటేష్(nabha natesh) మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులేసుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేసినా అమ్మడికి ఇస్మార్ట్ శంకర్(ismart shankar) సినిమా తప్ప చెప్పుకోదగ్గ సక్సెస్ మరోటి లేదు.ప్రస్తుతం స్వయంభు(swayambhu) సినిమాలో నటిస్తున్న నభా ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో నెటిజన్లను ఎట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా నభా కార్ గ్యారేజ్ లో మెకానిక్ గా మారి కార్ రిపేర్ చేస్తున్నట్టు ఫోటోలకు పోజులిస్తూ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. ఒంటికి ఆయిల్, గ్రీస్ రాసుకుని సరికొత్తగా తన అందాలను ఆరబోయగా, ఆ ఫోటోలకు కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే మరికొందరు మాత్రం అందాల ఆరబోతకు ఇంతకంటే మరో మార్గం దొరకలేదా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఏదేతేనేం తను అనుకున్న అటెన్షన్ ను అయితే నభా దక్కించుకుంది.