Nabha Natesh: చీరకట్టులో వింటేజ్ లుక్ లో ఇస్మార్ట్ బ్యూటీ

సుధీర్ బాబు(Sudheer Babu) హీరోగా తెరకెక్కిన నన్ను దోచుకుందువటే(Nannu Dochukunduvate) మూవీతో టాలీవుడ్లోకి హీరోయిన్ గా పరిచయమైన నభా నటేష్(Nabha Natesh) ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్(iSmart Shankar) సినిమాతో మంచి హిట్ అందుకుంది. తర్వాత పలు సినిమాల్లో అవకాశాలైతే అందుకుంది కానీ అనుకున్న స్టార్‌డమ్ అయితే దక్కలేదు. అయితే నభా సినిమాల విషయంలో ఎలా ఉన్నా సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తన అప్డేట్స్ ను ఇస్తూ ఫాలోవర్లకు టచ్ లోనే ఉంటుంది. తాజాగా నభా చీర కట్టుకుని తన అందాలను ఒలకబోసింది. పేస్టల్ గ్రీన్ శారీ, క్రీం కలర్ బ్లౌజ్ ధరించిన నభా నటేష్ ఆ లుక్ లో మరింత అందంగా కనిపించింది. చీరకట్టులో వింటేజ్ లుక్ లో కనిపించిన నభా తన నడుము, నాభి అందాలను ఎలివేట్ అయ్యేలా ఫోటోలకు పోజులివ్వగా, ఆ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.