అంచనాలు పెంచుతున్న నా సామిరంగ
టాలీవుడ్ కింగ్ నాగార్జునకు సాలిడ్ హిట్ పడి చాలా కాలమవుతుంది. బంగార్రాజు ఆడింది కానీ తర్వాత వెంటనే ది ఘోస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. అందుకే ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని పర్ఫెక్ట్గా ప్లాన్ చేశాడు నాగార్జున. ఈ సంక్రాంతికి నా సామిరంగ తో మంచి హిట్ అందుకోవాలని చాలా పట్టుదలతో ఉన్నాడు నాగ్.
సంక్రాంతికి పలు స్టార్ హీరోల సినిమాలు రేసులో ఉన్నప్పటికీ, నాగ్ కూడా నా సామిరంగతో రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటివరకు బయటకొచ్చిన ప్రతీ కంటెంట్ ఆడియన్స్ ను ఇంప్రెస్ చేస్తూనే ఉంది. సినిమా అనౌన్స్మెంట్తోనే మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసిన నాగ్, ఈ సినిమాతో ఆడియన్స్ కు మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వడం ఖాయంగానే కనిపిస్తుంది.
మలయాళ మూవీ పొరింజు మరియం జోస్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద నాగ్ ఎంతో కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటేందుకు నాగ్ రెడీ అవుతున్నాడు. విలేజ్ బ్యాక్ డ్రాప్ మూవీ అవడం, నాగ్ మాస్ లుక్, అల్లరి నరేష్ స్క్రీన్ ప్రెజెన్స్.. ఇవన్నీ ఈ సినిమాకు కలిసొచ్చే అంశాలని తెలుస్తోంది. నా సామిరంగ సంక్రాంతికి సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అర్థమవుతోంది. మరి ఇన్ని అంచనాల మధ్య రానున్న నా సామిరంగ ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి.













