Kangana Ranaut: పుట్టిన 10 రోజులకే అన్న చనిపోయాడు
ఎప్పుడూ ఏదొక వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచే బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్(Kangana Ranaut) రీసెంట్ గా ఫ్యామిలీ గురించి మాట్లాడి వార్తల్లోకెక్కింది. చిన్నప్పటి నుంచి తండ్రి తనను తక్కువ చేసి మాట్లాడేవాడని, బాగా చదువుకుంటేనే మంచి ఫ్యామిలీ వస్తుందని, లేకపోతే మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేయనని బెదిరించేవాడని, ఆయన చెప్పింది తన మంచికే అయినా ఒకరు చెప్పినట్టు జీవితంలో ముందుకెళ్లడం తనకు నచ్చలేదని చెప్పింది.
తన కుటుంబంలో తల్లికి తన కంటే ముందు ఓ బాబు పుట్టి 10 రోజులకు చనిపోయాడని, బొడ్డు తాడు ఎక్కువగా కట్ చేయడం వల్ల అతను చనిపోయాడని తన తల్లి చెప్తుండేదని, ఆ విషయంలో ఆమె చాలా బాధ పడిందని చెప్పిన కంగనా అలా అవడం వల్ల తన నానమ్మ తన తల్లిని మరోసారి డెలివరీ కోసం హాస్పిటల్ కు పంపలేదని వెల్లడించింది.
హాస్పిటల్ కు వెళ్తే పిల్లలు చనిపోతారనే మూఢ నమ్మకంతోనే తన నానమ్మ ఇంట్లోనే డెలవరీ అయ్యేలా ఏర్పాట్లు చేసిందని, డెలివరీ కోసం హాస్పిటల్ కు వెళ్లకూడదని కండిషన్ పెట్టిందని, ఆ కండిషన్ వల్ల తన తల్లి ఇంట్లోనే ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిందని, తన మేనత్త కూడా ఇంట్లోనే ఇద్దరు పిల్లల్ని కనిందని కంగనా రనౌత్ ఎవరికీ తెలియని విషయాన్ని తెలిపింది.







