OG: ఇంటర్వెల్ కు పూనకాలు తెప్పించనున్న తమన్
పవన్ కళ్యాణ్(pawan kalyan) హీరోగా చేస్తున్న సినిమాల్లో భారీ హైప్ ఉన్న సినిమా ఓజి(OG). రన్ రాజా రన్(Run raja run), సాహో(saaho) ఫేమ్ సుజిత్(Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో రిలీజవాల్సింది కానీ పవన్ మధ్యలో పాలిటిక్స్ లో బిజీ అవడంతో ఆ సినిమా లేటవుతూ వచ్చింది. రీసెంట్ గానే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది.
అయితే ఓజి నుంచి గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచి ఈ సినిమాపై అందరికీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రియాంక అరుళ్ మోహన్(Priyanka Arul Mohan) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా కు తమన్(thaman) మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. మొదటి నుంచి ఓజికి బెస్ట్ వర్క్ ఇస్తానని ప్రామిస్ చేసిన తమన్, చెప్పినట్టుగానే రీసెంట్ గా ఫస్ట్ లిరికల్ తో మంచి మార్కులేయించుకున్నాడు.
ఈ నేపథ్యంలో తర్వాతి సాంగ్స్, బీజీఎం కూడా ఇంకా బెస్ట్ ఉండాలనుకుంటారు ఆడియన్స్. ఈ విషయంలో తమన్ పై ఎక్కువ ఒత్తిడే ఉంటుంది. అయినప్పటికీ తమన్ దాన్ని బాధ్యతగా తీసుకుని ఓజికి ది బెస్ట్ ఇవ్వాలని చూస్తున్నాడట. అందులో భాగంగానే ఓజి ఇంటర్వెల్ సీన్ కు తమన్ నెక్ట్స్ లెవెల్ బీజీఎం ఇచ్చాడని, ఆ సీన్ సినిమాకే హైలైట్ కానుందని సన్నిహిత వర్గాలంటున్నాయి.







