Murugadoss: ప్రతీ రోజూ సికిందర్ షూట్ లేటే.. కారణమేంటంటే
సల్మాన్ ఖాన్(Salman Khan) హీరో మురుగుదాస్(Murugadoss) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సికిందర్(Sikandar). ఈద్ సందర్భంగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. రష్మిక(rashmika) హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ప్రమోషన్స్ లో చిత్ర డైరెక్టర్ మురుగదాస్ సినిమా గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఈ మూవీలో చాలా సన్నివేశాలు ఎక్కువమందితో చేయాల్సి వచ్చిందని తెలిపారు.
సెట్స్ లో ఒక్కోసారి పది వేల నుంచి ఇరవై వేల మంది వరకు ఉండేవారని, వారందరితో కలిసే సల్మాన్ సీన్ చేయాల్సి వచ్చేదని, అందుకే ఎంతో సెక్యురిటీ ఉండేదని చెప్పారు. అంతా ప్లాన్ చేసుకునే టైమ్ కు సల్మాన్ కు బెదిరింపులు రావడంతో షూటింగ్ మరింత బిజీగా మారిందని ఆయన తెలిపారు.
బెదిరింపులను దృష్టిలో పెట్టుకుని సెక్యురిటీని మరింత పెంచామని, దీంతో సెట్స్ లో అందరినీ చెక్ చేయడానికే 3 గంటల టైమ్ పట్టేదని, ప్రతీ రోజూ షూటింగ్ లేటయ్యేదని, చిత్ర షూటింగ్ మొత్తం దాదాపు అలాగే ఫినిష్ చేసినట్టు మురుగదాస్ తెలిపారు. ఇదిలా ఉంటే ఈ మూవీలో ఎన్నో ట్విస్టులుంటాయని, సికిందర్ కేవలం మాస్ మూవీ మాత్రమే కాదని, సినిమలో చాలా బలమైన ఎమోషన్స్ తో పాటూ మంచి సందేశం కూడా ఉంటుందని ఆయన తెలిపారు.













