Murugadoss: సర్కార్ బదులు ఆ సినిమా చేయాల్సింది

స్టార్ హీరో దళపతి విజయ్(Vijay) మరియు స్టార్ డైరెక్టర్ మురుగదాస్(murugadoss) కాంబినేషన్ కు కోలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది. వీరిద్దరి కలయికలో మూడు సినిమాలు రాగా ఆ మూడు సినిమాలూ మంచి టాక్ తో పాటూ బాక్సాఫీస్ వద్ద రికార్డులు కూడా సృష్టించాయి. వీరిద్దరి కాంబినేషన్ లో కత్తి(Katthi), తుపాకి(Thupakki), సర్కార్(Sarkar) సినిమాలు రాగా ఆ మూడూ బ్లాక్ బస్టర్లుగా నిలిచాయి.
అయితే కత్తి, తుపాకి సినిమాలు చేశాక మురుగదాస్ దళపతితో చేయాలనుకున్న సినిమా సర్కార్ కాదని, ఆ రెండు సినిమాల తర్వాత తాను విజయ్ తో చేయాలనుకున్న సినిమా వేరే అని రీసెంట్ గా మదరాసి(madarasi) ప్రమోషన్స్ లో భాగంగా మురుగుదాస్ బయటపెట్టారు. కత్తి, తుపాకి తర్వాత తాను విజయ్ తో ఓ రోడ్ ట్రిప్ మూవీ తీయాలనుకున్నట్టు ఆయన వెల్లడించారు.
డ్రై యాక్షన్ సీన్స్ తో ఆ మూవీని నెక్ట్స్ లెవెల్ లో తెరకెక్కిద్దామనుకున్నానని, కానీ తర్వాత ప్లాన్స్ మొత్తం మారిపోయి సర్కార్ మూవీ చేయాల్సి వచ్చిందని మురుగుదాస్ చెప్పారు. దీంతో ఫ్యాన్స్ విజయ్ తో రోడ్ ట్రిప్ మూవీ తీసుంటే అది ఎప్పటికీ మెమొరబుల్ ఫిల్మ్ గా మిగిలేదని చెప్తూ మురుగదాస్ చెప్పిన విషయాన్ని నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఇక మదరాసి విషయానికొస్తే శివ కార్తికేయన్(Siva Karthikeyan) హీరోగా రుక్మిణి వసంత్(rukmini vasanth) హీరోయిన్ నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.