‘మురికివాడ’ షూటింగ్ ప్రారంభం
విజయ్, ప్రేమ, ఆశా రాథోడ్, మధుప్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం మురికివాడ. పాలిక్ దర్శకుడు. తిరుపతి పటేల్, రామ్, భాను, నీలిమ నిర్మాతలు. ఈ చిత్రం హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి రాజ్ కందుకూరి క్లాప్‌నివ్వగా, సాయి వెంకట్ కెమెరా స్విచ్చాన్ చేశారు. తుమ్మలపల్లి రామసత్యనారాయణ గౌరవ దర్శకత్వం వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ఓ మురికివాడలోని కొందరి స్నేహం నేపథ్యంలో సందేశాత్మకంగా రూపొందిస్తున్నాం. అందుకే స్నేహితుల దినోత్సవం రోజున దీన్ని ప్రారంభించామన్నారు. అశోక్ కుమార్, గీతా సింగ్ ముఖ్య పాత్రధారులు.













